ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగుల సర్వీసు అంశాలపై ప్రభుత్వ సలహాదారుగా నియమించే ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(AP Government Employees Association news) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అంశాలను సీఎం (ap cm jagan news) దృష్టికి తీసుకెళ్లినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్న అభియోగాలు, కోర్టు కేసుల చిట్టాను సీఎంకు ఇచ్చామని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన సీఎస్ సమీర్ శర్మను కలిసిన అనంతరం ఇదే అంశంపై విజ్ఞప్తి అందజేశామని వెల్లడించారు.
' చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించవద్దు' - ap government employees association
చంద్రశేఖర్ రెడ్డి( chandra sekhar reddy news) ప్రభుత్వ సలహాదారుగా నియమించే ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లినట్లు వెల్లడించింది.
AP Government Employees Association