రాష్ట్రంలో సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు నాలా చట్ట నిబంధనలు సవరిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీ వ్యవసాయ భూమి చట్టం 2006 ప్రకారం భూ వినియోగమార్పిడి నిబంధనలను సరళతరం చేశారు. భూవినియోగ మార్పిడి రుసుమును మీసేవతోపాటు గ్రామ సచివాలాయాల్లోనూ చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. వినియోగ మార్పిడి అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారాన్ని స్థానిక ఆర్డీఓకు కల్పించారు. దరఖాస్తు వచ్చిన తర్వాత భూ వినియోగమార్పిడికి అనుమతివ్వాలా? లేదా? అనే అంశంతోపాటు.. అభ్యంతరాల పరిశీలనకు సంబంధించి స్థానిక తహసీల్దారు నుంచి వివరాలు తెప్పించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐతే..వివాదాలకు సంబంధించిన అంశాలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీళ్లు, రివిజన్లు జిల్లా జాయింట్ కలెక్టర్ల వద్ద ఉంటాయని తెలిపింది.
నాలా చట్టంలో మార్పులు.. వ్యవసాయేతర అవసరాలకు సాగు భూమి - ఏపీ నాలా చట్టంలో మార్పులు
రాష్ట్రంలో సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు నాలా చట్ట నిబంధనలు సవరిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ap government