ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSRCP Party colors: పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం - ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు

YSCP Party colors
YSCP Party colors

By

Published : Oct 6, 2021, 1:09 PM IST

Updated : Oct 6, 2021, 2:25 PM IST

13:07 October 06

YSRCP Party colors: పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం

         చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు (YSRCP Party colors) హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు (YSRCP Party colors) వేయమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేశారు.

పార్టీ రంగులు తొలగించి (YSRCP Party colors) ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్‌ జస్టిస్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:

AP RGUKT CET Results: ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

Last Updated : Oct 6, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details