ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Empolyees Union Rally: 'పీఆర్‌సీ సహా.. వాటిపైనా ప్రభుత్వం స్పందించాలి' - AP NGOs

AP Empolyees Union Rally: పీఆర్సీతోపాటు అన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. విజయవాడలో చేపట్టిన నిరసన ర్యాలీలో బొప్పరాజు, బండిశ్రీనివాసరావు పాల్గొన్నారు. వెంకట్రామిరెడ్డి తీరుతో సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని బొప్పరాజు విమర్శించారు. ఆయన విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

apngo
ap jac

By

Published : Dec 13, 2021, 4:52 PM IST

'పీఆర్‌సీ సహా అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి'

AP Empolyees Union Rally: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు పశ్చిమ కృష్ణ జిల్లా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొప్పరాజు.. పీఆర్సీతో పాటు అన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. 13 లక్షల మంది ఉద్యోగుల అభిమానాన్ని తాకట్టు పెట్టవద్దని వెంకట్రామిరెడ్డికి హితవు పలికారు. ప్రభుత్వం కూడా వెంకట్రామి రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సచివాలయ ఉద్యోగులు వెంకటరామిరెడ్డి తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

పీఆర్‌సీ సహా అన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం స్పందించాలి. వెంకట్రామిరెడ్డి వల్ల సచివాలయ ఉద్యోగులు నష్టపోతున్నారు. ఆయన విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్

సజ్జల నుంచి ఫోన్..
ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారులతో సమావేశం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారని బండి శ్రీనివాసరావు చెప్పారు. కానీ ఆ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. సమావేశం ఉంటే 71 డిమాండ్లతో కూడిన పీఆర్సీపై చర్చించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపైనే తాము ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని పలువురు ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సహా పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

'సాయంత్రం 5 గంటలకు అధికారుల భేటీ ఉందని సజ్జల చెప్పారు. కానీ.. ఆ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. సమావేశం జరిగితే 71 డిమాండ్లతో కూడిన పీఆర్‌సీపై చర్చించాలి' - ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

ఇదీ చదవండి:
CM Jagan On Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేయండి - సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details