APCRDA on Unfinished works in Amaravati: హైకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలో అసంపూర్తిగా ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో పిచుకులపాలెం, అనంతవరం, దొండపాడు, తుళ్లూరు మధ్య రైతులకు ఇచ్చిన ప్లాట్లలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ నాలుగు గ్రామాల పరిధిలోని సుమారు 4వేల ప్లాట్లలో ఉన్న కంప చెట్లను తొలగిస్తున్నారు. రూ. 132 కోట్లతో 63 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రాజధానిలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నివాస సముదాయాలను నవంబర్ నాటికి పూర్తి చేస్తామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కమిషనర్ అన్నారు.
అమరావతిలో రూ. 132 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
APCRDA on Works at Amaravati: అమరావతి రాజధానిలో రూ. 132 కోట్లతో అభివృద్ధి పనులను ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి రాజధానిలో అసంపూర్తిగా ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు.
ap crda start works at Amaravati
ఉద్ధండరాయునిపాలెంకు చెందిన రైతు పులి చిన్న.. అసైన్డ్ రైతులకు కౌలు చెక్కులు ఇవ్వాలని కోరుతూ కమిషనర్ కాళ్లపై పడ్డాడు. స్పందించిన కమిషనర్.. అసైన్డ్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని.. త్వరలోనే కౌలు చెక్కులు అందజేస్తామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:
Last Updated : Jul 4, 2022, 8:14 PM IST