జిల్లాల వారీగా మృతులు...
24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదు - ఏపీపై కరోనా ప్రభావం
18:06 August 11
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. 24 గంటల వ్యవధిలో 87 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా మృతులు 2,203కు చేరాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 1,54,749 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 87,597 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 58,315 మందికి కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 25.92 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
అనంతపురం-13, చిత్తూరు-12, గుంటూరు-9, ప్రకాశం-7, విశాఖ-7, కడప-6, శ్రీకాకుళం-6, పశ్చిమగోదావరి-6, తూర్పుగోదావరి-5, నెల్లూరు-5, విజయనగరం-5, కృష్ణా-3, కర్నూలు-3.
జిల్లాల వారీగా కొత్త కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1372 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1138, అనంతపురం జిల్లాలో 959, చిత్తూరు జిల్లాలో 758, గుంటూరు జిల్లాలో 717, పశ్చిమగోదావరి జిల్లాలో 678, విశాఖ జిల్లాలో 676, విజయనగరం జిల్లాలో 594, కడప జిల్లాలో 579, శ్రీకాకుళం జిల్లాలో 504, నెల్లూరు జిల్లాలో 364, ప్రకాశం జిల్లాలో 343, కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండీ... 'ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది'