కర్నూలులో అదే ఉద్ధృతి.. రాష్ట్రంలో కొత్తగా 58 కేసులు
06:32 May 03
కొత్తగా 58 కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 58 కేసులు నమోదయ్యాయి. కొత్తగా గుర్తించిన బాధితుల్లో కర్నూలు జిల్లా నుంచే 30 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో మరో 11 మందికి కొవిడ్ సోకింది. ఆదివారం ఉదయానికి రాష్ట్రంలో 1,583 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 466 మంది ఉన్నారు.
- గడచిన 24 గంటల్లో 6,534 నమూనాలు పరీక్షించగా.. 58 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొత్తగా మరణాలేవీ లేవని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ ద్వారా తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 33గానే ఉంది.
- చికిత్స పొంది కోలుకోవడంతో 47 మందిని ఇళ్లకు పంపారు. 1,062 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- పది లక్షల జనాభాకు 2,152 మందికి పరీక్షలు చేయించుకుంటున్నారని ప్రభుత్వం వివరించింది. మొత్తం 1,14,937 పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.
ఇదీ చదవండి : 'మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'