ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'భాజపా ఆటలు ఇక్కడ సాగవు'

By

Published : Jan 5, 2021, 6:45 PM IST

భాజపాను గద్దె దించేందుకు రైతులంతా కలిసి పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్​ ఉమెన్‌ చాంది పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని ఇందిరాభవన్​లో ఏపీ రాష్ట్ర పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏపీలో భాజపా ఆటలు సాగవని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

shailajanath
ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

వ్యవసాయ వ్యతిరేఖ చట్టాలను తెచ్చిన భాజపాను గద్దె దించేందుకు రైతులంతా కలిసి పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్​ ఉమెన్‌ చాంది పిలుపునిచ్చారు. రైతుల తరుపున ఏపీలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్​లోని ఇందిరాభవన్​లో ఏపీ రాష్ట్ర పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని, దానిపై ఎందుకు పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ స్పష్టం చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఈ దాడులపై సీరియస్​గా దృష్టి పెట్టాలన్న ఆయన.. ఏపీలో భాజపా ఆటలు సాగవన్నారు. ఒకట్రెండు రోజుల్లో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించనున్నట్లు శైలజానాథ్​ పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details