జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఏడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో రెండు అభియోగపత్రాలు సమర్పించింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో.. ఈడీ ఇటీవల ఛార్జ్‌షీట్లను కోర్టుకు సమర్పించింది. జగన్ సహా పలువురిపై అభియోగాలను పేర్కొంది. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని.. గతంలో సీబీఐ తేల్చింది. వాటికి సంబంధించిన అక్రమ లావాదేవీల చెలామణిపై సుదీర్ఘ దర్యాప్తు జరిపిన ఈడీ.. గతంలోనే పలు ఆస్తులు అటాచ్ చేసింది.
Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు - ap latest news
11:02 August 17
జగన్ అక్రమాస్తుల కేసు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన వాన్‌పిక్ ప్రాజెక్టులో క్విడ్ ప్రొకో జరిగినట్లు సీబీఐ పేర్కొంది. వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు 863 కోట్ల రూపాయల ఆస్తులను 2016లో ఈడీ జప్తు చేసింది. జగన్‌కు చెందిన సుమారు 538 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాన్ పిక్ భూములతో పాటు.. నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన 325 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. అనంతపురం జిల్లా గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో.. 8వేల844 ఎకరాల్లో చేపట్టిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌సెజ్‌లోనూ అక్రమాలు జరిగాయని గతంలో సీబీఐ పేర్కొంది.
దీని ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన 130 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చెందిన 8వేల 844 ఎకరాలతో పాటు కూకట్‌పల్లి ఇందూ టౌన్‌షిప్ భూములను తాత్కాలిక జప్తు చేసింది. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశాలపై దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ..ఇటీవల ఛార్జ్ షీట్లను సీబీఐ, ఈడీ కోర్టుకు సమర్పించింది. గతంలోనే ఛార్జ్‌షీట్లను దాఖలు చేసినప్పటికీ.. వివిధ సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి ఇవ్వడంతో..సరిచేసి ఇటీవల మళ్లీ సమర్పించారు. ఛార్జ్ షీట్లపై త్వరలో కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడి.. వర్షంలోనూ కార్మికుల ఆందోళన