ఈ నెల 27వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.
27న కేబినెట్ భేటీ... అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చ... - నంబర్ 27న కేబినెట్ మీటింగ్
ఈ నెల 27వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో..సమావేశాల నిర్వహణ, సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.
Ap cabinet meeting
నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దిశ బిల్లు సవరణ, అసైన్డ్ భూముల వ్యవహారం తదితర అంశాలు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి :కొత్త జిల్లాల అధ్యయన కమిటీలో డీజీపీకి చోటు
Last Updated : Nov 19, 2020, 7:34 PM IST