మహిళలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా... రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మహిళా భద్రత బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించేందుకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనిని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది.
మహిళా భద్రత బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - ఏపీ మంత్రివర్గం సమావేశం
మహిళల భద్రతకు సంబంధించిన కీలక బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అతివలు, చిన్నారులపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడటమే ఈ బిల్లు ఉద్దేశం.
ముఖ్యమంత్రి జగన్