ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై సభ్యులు సభలో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సభలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యారంగానికి సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును అసెంబ్లీ సహా మండలి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ చట్టానికి చేసిన సవరణలను ఆమోదించారు. ఈ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.
అసెంబ్లీలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై సభ్యులు సభలో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సభలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది.
ap assembly