- నెల్లూరు కోర్టులో చోరీకి పాల్పడింది.. పాత సామాన్ల దొంగలే: జిల్లా ఎస్పీ
Nellore Theft Case: ఇటీవల నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసులో పురోగతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విజయారావు వెల్లడించారు. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
- నెల్లూరు వైకాపాలో ముదిరిన వర్గపోరు.. సాయంత్ర తాజా, మాజీ మంత్రుల సభలు..!
ysrcp focus on Kakani, Anil: నెల్లూరులో టెన్షన్ వాతావరణానికి తెర దించేందుకు అధిష్టానం రంంలోకి దిగింది. మంత్రి కాకాణి, మాజీ మంత్రి సభల నేపథ్యంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువురు నేతలు సభలు నిర్వహించుకున్నా... పరస్పర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఈరోజు ఇరువురు నేతల వేర్వేరు సభల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
- రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. 15 మందికి గాయాలు!
కర్నూలు జిల్లా హోళగుందలో శనివారం రాత్రి నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఊరేగింపు జరుగుతున్న క్రమంలో ఓ వర్గం వారు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 15 మందికిపైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఆలూరు సీఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే బందోబస్తులో ఉన్నట్లు తెలిసింది.
- TDP Protest: 'పల్లెవెలుగు'లో ఛార్జీలు రెండింతలు పెంచడం దారుణం: తెదేపా
TDP Protest: రాష్ట్రంలో పన్నులు, అధిక ధరల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. జగన్ ప్రభుత్వం ప్రజలపై పెంచుతున్న భారాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా బాపట్ల జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ర్యాలీ నిర్వహించగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు సారథ్యంలో సైకిల్ యాత్ర చేశారు.
- పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే..
Husband dies accident Mangaluru: భర్త మరణవార్త విని తట్టుకోలేక ఓ భార్య తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో జరిగింది.
- భార్యపై కోపం.. మరో ఇద్దరిని పిలిపించి గ్యాంగ్ రేప్
Husband Forced Gang Rape Of Wife: భార్యపై కోపంతో దారుణానికి తెగించాడో వ్యక్తి. మరో ఇద్దరిని పిలిపించి.. ఆమెపై సామూహిక అత్యాచారం చేసేలా ప్రోత్సహించాడు. ఆ ఇద్దరూ.. భర్త కళ్లెదుటే ఆ మహిళపై అఘాయిత్యం చేశారు. ఈ భయానక ఘటన మహారాష్ట్ర ఔసాలోని సారోలా ప్రాంతంలో జరిగింది.
- 5 శాతం జీఎస్టీ శ్లాబు ఎత్తివేత? ఇక పన్నుల బాదుడే!
GST Slabs: జీఎస్టీ మండలి పలు మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముఖ్యంగా 5 శాతం పన్ను శ్లాబును ఎత్తేయనున్నట్లు సమాచారం. దీనిని.. 7, 8 లేదా 9 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.
- అఫ్గాన్‌పై పాక్ వాయుదాడులు.. 40 మంది మృతి
Pakistan Air Strike: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా మృతిచెందారు. పాక్ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
- 'భారత్‌కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం'
Dinesh Karthik IPL 2022: టీ20 ప్రపంచకప్- 2022లో భారత్‌ను జగజ్జేతగా నిలపటమే తన లక్ష్యమని వెటనర్ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో శనివారం రాత్రి దిల్లీపై ఆర్సీబీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడాడు. మరోవైపు.. దినేశ్ కార్తీక్‌పై ప్రశంసలు కురిపించాడు బెంగళూరు కెప్టెన్ డూప్లిసెస్.
- 'ఆ పని కూడా అయిపోయింది'.. సూపర్ అప్డేట్ షేర్ చేసిన సామ్
Samantha Shakunthalam Movie: డిఫరెంట్ సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్న సమంత.. ప్రస్తుతం పలు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో 'శాకుంతలం' ఒకటి. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను షేర్ చేసింది సామ్.