- విద్యార్థి సంఘాల "చలో రాజ్‌భవన్".. నేతల అరెస్టు
Students union chalo raj bhavan: విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్ చేయాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు... రాజ్‌భవన్, ధర్నాచౌక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయలకులను అరెస్ట్ చేశారు.
- గుంటూరులో వైద్యం వికటించిన.. బాలిక ఆరాధ్య మృతి
అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు కనుమరుగైపోయింది. కంటి కింద కణితి... తొలగించాలని ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు... పాప శవాన్ని అప్పగించారు. ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ చిట్టితల్లి.. తిరిగిరాని లోకాలకు చేరింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది.
- మాటల్లేవ్.. కత్తుల పోట్లే.. దారుణానికి ఒకరు బలి!
దారి విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా తయారైంది. కొట్లాటకు, ఆపై కత్తి పోట్లకూ దారి తిసింది. ఈ దారుణ సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైంది. మరో ప్రాణం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
- KA PAUL: వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో.. ప్రభంజనం మాదే : కేఏ పాల్
KA PAUL: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో శుక్రవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణతోపాటు దేశ అప్పులపై అమిత్‌షాతో చర్చించినట్లు పాల్ తెలిపారు. ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో.. ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామన్న ఆయన.. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
- దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి.. సీఎం అత్యవసర సమావేశం
Three Policemen Killed: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
- భారీ బందోబస్తు నడుమ.. జ్ఞాన్వాపీ మసీదు సర్వే షురూ
Gyanvapi Mosque Survey: ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ జ్ఞాన్వాపీ మసీదు సర్వే చేపట్టారు అధికారులు. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. జ్ఞాన్వాపీ మసీదు, శృంగార్ గౌరీ ప్రాంగణంలో సర్వే చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశించిన సివిల్ జడ్డ్ జస్టిస్ రవికుమార్ దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని అన్నారు.
- Niharika Nm: ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు క్యూ!
అమెరికా నుంచి అలా అడుగుపెట్టిందో లేదో.. నిహారికకి 'కేజీఎఫ్ హీరో యష్‌తో పనిచేస్తారా?' అని ఫోన్! నెల తిరక్కుండానే మళ్లీ అదే ప్రశ్న. ఈసారి అవకాశం మహేశ్‌బాబుతో! అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్.. ఆమె డేట్స్ కోసం ప్రయత్నించినవారే. హీరోయిన్ కోసం అనుకుంటున్నారా? కాదండీ.. ఒక్కటీ.. ఒకే ఒక్క రీల్లో ఆమెతో పనిచేయడానికి ఇదంతా! అంత గొప్పేంటి ఆమెలో అంటారా? అయితే చదివేయండి!
- ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ.. మూడో బౌలర్‌గా రబాడ
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ, కగిసో రబాడ ఓ రికార్డు సాధించారు. ఆ వివరాలు..
- కొవిడ్‌తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్'!
North Korea Corona cases: ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది జ్వరంతో మరణించారు. మొత్తం మరణాలు 27కు చేరాయి. మరోవైపు.. మొత్తం జ్వరపీడితులు 5 లక్షలు దాటారు. ఈ క్రమంలో కరోనాను దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్‌గా పేర్కొన్నారు కిమ్ జోంగ్ ఉన్.
- 'పురుషులను 'బట్టతల' అని పిలవడం లైంగిక వేధింపే!.. పరిహారం కట్టాల్సిందే..'
bald head news: పురుషులను బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తీర్పు చెప్పింది ఇంగ్లాండ్ ట్రైబ్యునల్. ఈ చర్య పనిచేసే చోట వారి గౌరవాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు.. సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.