‘అమ్మఒడి’ పథకం కింద ఇస్తున్న రూ.15వేలల్లో ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోత వేయనుంది. మొత్తంగా రూ.2వేలకు కోతపడనుంది. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు సిద్ధమైంది.
‘అమ్మఒడి’ పథకంలో మళ్లీ కోత.. ఈసారి ఎంతంటే.. - అమ్మఒడి పథకంలో మళ్లీ కోత
‘అమ్మఒడి’ పథకం కింద ఇస్తున్న రూ.15వేలల్లో ప్రభుత్వం కోత విధించింది. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు సిద్ధమైంది.
ఈ పథకం కింద జూన్‌లో రూ.13వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యాశాఖ ద్వారా బడుల నిర్వహణకు కేటాయిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని జిల్లాస్థాయి అధికారులకు చేరవేశారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30వరకు విద్యార్థి హాజరు 75శాతం ఉంటేనే అమ్మఒడి నగదు అందుతుంది. అమ్మఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో దీన్ని జూన్‌కు మార్చారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. కత్తులతో 20 సార్లు పొడిచి..