- ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు!
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారుల సూచనతో... ఆనందయ్య బృందం ఔషధం తయారీకి సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ..హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో సీఎస్‌గా పనిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- తమ్మినేని సీతారామ్‌కు స్వల్ప అస్వస్థత
సభాపతి తమ్మినేని సీతారామ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- విశాఖ పసికందు.. కరోనాను జయించింది!
ఏడాది కాలంగా.. మానవాళి కంటిపై కునుకులేకుండా చేస్తున్న మహమ్మారి ధాటికి.. దేశంలో వేల మంది బలవుతున్నారు. లక్షల మంది వైరస్ బారినపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ నవజాత శిశువు కరోనాను జయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 1.27 లక్షల కొత్త కేసులు.. 2795 మరణాలు
దేశంలో కరోనా కేసులు(Corona Update) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,27,510 మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారిన పడి మరో 2,795 మంది మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మందుప్రియులకు దిల్లీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- హైకోర్టు విచారణ.. యూట్యూబ్‌లో లైవ్
నాలుగు గోడల మధ్య జరిపే కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేసింది కర్ణాటక హైకోర్టు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించింది. ఇలా జరగడం న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్రిటన్‌లో మరికొద్ది రోజుల్లో మూడో దశ కరోనా(Third Wave of corona) విజృంభించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అన్నిరకాల కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగించాలని ఆ దేశ ప్రధానికి సూచిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- టీమ్ఇండియాకు మాజీ క్రికెటర్ హెచ్చరిక
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final) న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని టీమ్ఇండియాకు(Team India) సూచించాడు భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్. అండర్‌డాగ్స్‌గా బరిలో దిగి గెలిచే సత్తా కివీస్‌కు ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- సూపర్‌స్టార్‌తో తలపడనున్న యాక్షన్ కింగ్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.