ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రవాణా పన్నులు పెంపు...ప్రతిపాదనలు సిద్ధం..! - రవాణా పన్ను

రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రవాణా పన్నులను పెంచటం ద్వారా కొంతమేర ఆదాయాన్ని గడించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

andhrapradesh
andhrapradesh

By

Published : Sep 5, 2020, 4:07 AM IST

రవాణ శాఖలో పన్నులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు పై విధించే లైఫ్‌ ట్యాక్స్ పెంచాలని రవాణ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పన్నుల పెంపు ప్రతిపాదనల ద్వారా అదనంగా 400 కోట్లు వస్తాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు లైఫ్ ట్యాక్స్ రెండు రకాల శ్లాబుల్లో 1 నుంచి 3 శాతం మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 50 వేలలోపు ధర కలిగిన ద్విచక్ర వాహనాలు, ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా.

8 లక్షల్లోపు ధర కలిగిన నాలుగు చక్రాల వాహనాలు, ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్సు చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేశారు. నాలుగు చక్రాల వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా సుమారు 140 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ వాహానాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా 30 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details