రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. వీరివల్ల సుమారు 300 మందికిపైగా వైరస్ సోకినట్లు ప్రభుత్వం తేల్చింది. ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు సేకరించి గుర్తించారు. వీరిని వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్ స్ప్రెడర్’గా పేర్కొంటోంది.
ఈ నెల 5వ తేదీ వరకు సేకరించిన సమాచారం ప్రకారం...
*కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్ సోకింది. ఒకరి ద్వారా ఇంతమందికి వైరస్ సోకడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.
*కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది.
*గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్ సోకింది. ఈ జిల్లాలోనే పలువురిలో ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్ బారిన పడేందుకు కారణమయ్యారు.
*అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్ సోకింది.
*ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది మందికి వైరస్ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.