ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

andhra pradesh top news
andhra pradesh top news

By

Published : Nov 16, 2020, 12:59 PM IST

  • జగన్​ లేఖ కేసులో.. విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్

న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై.. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ లలిత్ కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మా పిలుపుతో ప్రభుత్వం దిగొచ్చింది: సీపీఐ రామకృష్ణ

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల ప్రవేశాలకు తాము ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం దిగొచ్చిందని సీపీఐ రామకృష్ణ అన్నారు. లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ప్రభుత్వం నిర్వాకంతోనే రైతుల ఆత్మహత్యలు'

రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల పట్ల తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోవటం వల్లే అన్నదాతల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనా!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉండేందుకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సమావేశాల నిర్వహణపై ఇప్పటివరకు పార్లమెంట్ ఉభయసభలు సన్నాహాలు ప్రారంభించలేదు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తెరుచుకున్న ఆలయాలు- భారీగా తరలిన భక్తులు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉత్తర్వులతో ఆలయాలు, ప్రార్థన స్థలాలు తెరుచుకున్నాయి. దీంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివెళ్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బాల్యాన్ని దారి మళ్లిస్తున్న ఆధునిక జీవనశైలి

దేశంలో నానాటికీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. రోజుకో తీరున హత్యలు,మానభంగాలు,కిడ్నాప్​ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో నేర స్వభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఇది మీ కోసమే

ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది బ్యాంకులు.. ఆఫర్లలో జారీ చేసిన క్రెడిట్​ కార్డులను పొంది.. వినియోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ట్రంప్.. ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకో'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భారత క్రికెట్ అభిమానుల గుండె పగిలిన రోజు​

భారత క్రికెట్​ అభిమానుల గుండె పగిలిన రోజు ఇది. క్రికెట్ గాడ్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్.. ఆటకు వీడ్కోలు చెప్పి, సోమవారానికి ఏడేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాలు మరోసారి మీకోసం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బాలకృష్ణ చేతుల మీదుగా 'సెహరి' ఫస్ట్​లుక్

బాలయ్య చేతుల మీదుకగా 'సెహరి' ఫస్ట్​లుక్ విడుదలైంది. కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details