Andhra pradesh Government on Transfers : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై పాక్షికంగా నిషేధం సడలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 4 తేదీ వరకు ఉద్యోగుల పరస్పర బదిలీల దరఖాస్తును అంగీకరిస్తామని పేర్కొంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వరకూ మాత్రమే సాధారణ బదిలీలపై నిషేధం సడలిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా చేసింది. ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ పరస్పర బదిలీలకు అంగీకారం తెలిపినట్టు వెల్లడించింది. పరస్పర బదిలీ కోరుతున్న ఉద్యోగులు ఒకే చోట కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో జత చేసింది. ఏసీబీ, విజిలెన్సు కేసులు ఇతర అభియోగాలున్న ఉద్యోగుల బదిలీ దరఖాస్తును పరిశీలించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ANDHRA PRADESH GOVERNMENT ON TRANSFERS : బదిలీలపై పాక్షికంగా నిషేధం సడలింపు...ఉత్తర్వులు జారీ - ap news
Andhra pradesh Government on Transfers : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై పాక్షికంగా నిషేధం సడలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ పరస్పర బదిలీలకు ఆంగీకారం తెలిపినట్టు వెల్లడించింది.
బదిలీలపై పాక్షికంగా నిషేధం సడలింపు