హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో రహదారులన్నీ ప్రతి రోజూ రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటుంది. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రోజుకు సగటున 34 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయిదుగురు మృత్యువాత పడుతుంటే, 18 మంది గాయాలపాలవుతున్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనం నడుపుతుండటమే కారణమని చెబుతున్నారు.
సైబరాబాద్‌లో ఆందోళనకరం..
ప్రమాదాల నివారణపై పోలీసులు ఎంత దృష్టి పెడుతున్నా, తగ్గకపోగా.. ఏటా పెరుగుతున్నాయి. రాచకొండ, హైదరాబాద్‌తో పోలిస్తే సైబరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సైబరాబాద్ పరిధిలో 2019లో 3313 ఘటనల్లో 861 మంది మృతి చెందారు. గతేడాది లాక్‌డౌన్‌తో ప్రమాదాల సంఖ్య 3013కు తగ్గింది. మరణాల సంఖ్య సైతం 663కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది విషయానికొస్తే ఆరు నెలల్లోనే 2199 ప్రమాదాలు జరిగాయి. 325 మంది మృతి చెందారు. ఈ లెక్కన చూస్తే ఏడాది చివరకు 4 వేల మార్కును దాటొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో 2019లో 2496 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 271 మంది దుర్మరణం చెందారు. గతేడాది 527 ఘటనల్లో 68 మరణించారు. ఈ ఆరు నెలల్లో 2017 ప్రమాదాల్లో 173 మంది మృతి చెందారు. ఏడాది నాటికి 3,500కు పైగా నమోదయ్యే అవకాశముందంటున్నారు.
రాచకొండలో..