ఆంధ్రులకు అంగరంగ వైభవ రాజధానిని నిర్మింపజేయాలని రూ.కోట్లు వెచ్చించి అప్పట్లో భారీగా నిర్మాణ సామగ్రిని సమకూర్చారు. అనంతర కాలంలో పనులు నిలిచిపోయి ఎక్కడి సామగ్రి అక్కడే ఉండగా... అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. తమను ఆపేదెవరంటూ వారు చెలరేగిపోతున్నారు. తరచూ చోరీలకు పాల్పడుతూ అందినంత తరలించుకుపోతున్నారు. ప్రజాధనానికి పహారా కాస్తూ చోరీలకు అడ్డుకట్ట వేయాల్సిన వారేమో చేష్టలుడిగి చూస్తున్నారు. కొన్ని రోజులుగా రాజధాని అమరావతి భవన నిర్మాణ సామగ్రికి భద్రత కరవైంది. అక్రమార్కులు ఇసుక, మట్టిని దోచుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. కంకర కోసం రహదారులను ధ్వంసం చేస్తున్నారు. అప్పట్లో భవన నిర్మాణాలకు కోట్ల రూపాయలు వెచ్చించి రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తున ఇసుక, కంకర, ఇనుప సామగ్రి, పైపులు తీసుకొచ్చి ఉంచారు. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. శాసనసభ, హైకోర్టు ప్రాంగణాల సమీపంలోనే మట్టి, ఇసుకను అర్ధరాత్రి ట్రాక్టర్లలో ఎత్తుకుపోయారు. ఇంత జరుగుతున్నా దొంగలను పట్టుకున్న దాఖలాలు కానీ... సామగ్రికి పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు కానీ లేవు.
AMARAVATI: అమరావతి నిర్మాణ సామగ్రికి భద్రత కరవు
కంకర కనిపించగానే తమ వంకర బుద్ధులతో కాజేస్తున్నారు.. ఇసుకను ఇష్టానుసారం ఎత్తుకుపోతున్నారు.. పట్టించుకునే వారు లేరు కదా అని మట్టినీ పట్టుకుపోతున్నారు.. ఇదీ ప్రస్తుతం అమరావతిలోని అస్తవ్యస్త పరిస్థితి.
amaravathi