ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌ వన్‌టైమ్‌ సీఎం మాత్రమే..ఇక ఏడాదే అధికారం : చంద్రబాబు - Amravati Concerns

అమరావతి ఆందోళనలు
అమరావతి ఆందోళనలు

By

Published : Dec 17, 2020, 7:23 AM IST

Updated : Dec 17, 2020, 3:11 PM IST

15:09 December 17

చంద్రబాబు

  • నేనెవరికీ భయపడను.. మందుపాతర్లకూ భయపడలేదు: చంద్రబాబు
  • కరోనా పట్ల నేనెంతో బాధ్యతగా ప్రవర్తించా: చంద్రబాబు
  • కరోనాను అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉంది: చంద్రబాబు
  • 120 దేవాలయాలపై దాడి చేశారు.. ఒక్కరినైనా పట్టుకున్నారా?: చంద్రబాబు
  • వీరోచితంగా పోరాడేవారి సంఖ్య పెరిగితేనే ప్రభుత్వం దిగివస్తుంది: చంద్రబాబు
  • రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే గుణపాఠం చెబుతామని హామీ ఇస్తున్నా: చంద్రబాబు
  • ప్రజల చైతన్యం ముందు డబ్బు, అధికారం పనిచేయవు: చంద్రబాబు
  • అమరావతి ఇక్కడే ఉంటుందని బేషరతుగా ప్రకటించాలి: చంద్రబాబు


 

14:47 December 17

చంద్రబాబు

  • సింగపూర్‌ వంటి ప్రభుత్వం పెట్టుబడులతో ముందుకొచ్చింది: చంద్రబాబు
  • జగన్‌ తీరుతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు: చంద్రబాబు
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశంలో కొండను తవ్వారు.. ఎలుకనూ పట్టుకోలేకపోయారు: చంద్రబాబు
  • విశాఖలో జగన్‌ వేల ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారు: చంద్రబాబు
  • ప్రభుత్వాలు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలి: చంద్రబాబు
  • పేటీఎం బ్యాచ్‌ 3 రాజధానులకు మద్దతుగా ఇక్కడ ఉద్యమం చేస్తోంది: చంద్రబాబు
  • ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌: చంద్రబాబు

14:42 December 17

చంద్రబాబు

  • రెఫరెండానికి సిద్ధమా అని వైకాపా నేతలకు సవాల్‌ విసురుతున్నా: చంద్రబాబు
  • 3 రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా?: చంద్రబాబు
  • 3 రాజధానులకు ప్రజలు ఓటు వేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: చంద్రబాబు
  • ఈ జగన్‌ వన్‌టైమ్‌ ముఖ్యమంత్రి... ఎమ్మెల్యేలూ వన్‌టైమే: చంద్రబాబు
  • జగన్‌ తన అసమర్థతతో కడపను ముంచేశారు: చంద్రబాబు
  • ఒక్క అవకాశం అంటూ ప్రజలను మోసం చేశారు: చంద్రబాబు
  • అధికారంలోకి వచ్చాక 3 రాజధానులంటూ మోసగిస్తున్నారు: చంద్రబాబు
  • జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు: చంద్రబాబు
  • 20 నెలల్లో ఏమీ చేయని జగన్‌... మరో 12 నెలల్లో ఏం చేస్తారు: చంద్రబాబు


 

14:41 December 17

చంద్రబాబు

  • నాకు అమరావతిలో ఇల్లు లేదని విమర్శించారు: చంద్రబాబు
  • నీకు అమరావతిలో ఇల్లు ఉండి ఏంచేశారు: చంద్రబాబు
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని సీఎం ఆరోపిస్తున్నారు: చంద్రబాబు
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే 18 నెలల్లో ఏంచేశారు: చంద్రబాబు
  • ఒక సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా?: చంద్రబాబు
  • ఈ వేదికపై ఉన్న నాయకులందరికీ ఒకే కులమా?: చంద్రబాబు
  • వైకాపా నేతలు ఈ ఉద్యమాన్ని చూసి కళ్లు తెరవాలి: చంద్రబాబు
  • జగన్‌రెడ్డీ... నా దగ్గర నీ తెలివి పనిచేయదు: చంద్రబాబు
  • రాణిరుద్రమను మరిపించేలా అమరావతి మహిళలు పోరాడుతున్నారు: చంద్రబాబు
  • ద్రౌపది వస్త్రాన్ని లాగినందుకు ఒక సామ్రాజ్యం నాశనమైంది: చంద్రబాబు
  • ఈ ప్రభుత్వానికి రాజధాని మహిళల శాపం తగలక తప్పదు: చంద్రబాబు
  • ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలనుకోవడం నా తప్పా: చంద్రబాబు

14:38 December 17

చంద్రబాబు

  • అవసరం ఉన్నప్పుడు ముద్దులు, లేనప్పుడు పిడిగుద్దులు గుద్దుతారు: చంద్రబాబు
  • చరిత్రలో నిలిచే పోరాటం అమరావతి ఉద్యమం: చంద్రబాబు
  • వైకాపా నేతలు కళ్లు తెరిచి ఉద్యమాన్ని చూడాలి: చంద్రబాబు
  • ఉద్యమంలో ఉన్నదెవరో గుర్తించాలి: చంద్రబాబు
  • రైతులు, మహిళలను వ్యాపారులంటారా?: చంద్రబాబు
  • కనకదుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి: చంద్రబాబు
  • కనకదుర్గమ్మ మూడో కన్ను తెరుస్తుంది: చంద్రబాబు
  • రాక్షసులను కనకదుర్గమ్మ అంతమొందిస్తుంది: చంద్రబాబు
  • ఇప్పటికైనా జగన్‌ కళ్లు తెరిచి క్షమాపణ చెప్పి అమరావతిని కొనసాగించాలి: చంద్రబాబు
  • శంకుస్థాపన స్థలాన్ని పరిశీలిస్తే కడుపు తరుక్కుపోయింది: చంద్రబాబు


 

14:23 December 17

చంద్రబాబు

  • విప్లవ వీరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

14:19 December 17

ఏడాదైనా పోరాటం ఎక్కడా ఆగలేదు: ఎంపీ గల్లా జయదేవ్‌

  • కరోనా పరిస్థితుల్లోనూ పోరాటం సాగించారు: గల్లా జయదేవ్‌
  • అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగల్లేదు: ఎంపీ గల్లా జయదేవ్‌
  • ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారు: ఎంపీ గల్లా జయదేవ్‌
  • అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: గల్లా జయదేవ్‌
  • ఈ ప్రభుత్వంలో అప్పులు పెరిగిపోయాయి: గల్లా జయదేవ్‌
  • రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేందుకు ప్రణాళికలు చేస్తున్నారు: గల్లా జయదేవ్‌

14:19 December 17

ప్రపంచ చరిత్రలో ఇది అపురూపమైన పోరాటం: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి

  • ఏడాది నుంచి అమరావతి ఉద్యమం గాంధేయ మార్గంలో జరుగుతోంది: తులసిరెడ్డి
  • 3 రాజధానులపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవు: తులసిరెడ్డి
  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది: తులసిరెడ్డి
  • ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తిచేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది: తులసిరెడ్డి
  • సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది: తులసిరెడ్డి

14:18 December 17

మహిళలను కించపరిచేలా మాట్లాడితే వారికి శాపం తప్పదు: భాజపా

  • అమరావతి రాజధానిగా ఉండాలని భాజపా తీర్మానం: భాజపా నేత నాగభూషణం
  • రాజధాని కోసం భాజపా పోరాటం చేస్తుంది: భాజపా నేత పాతూరి నాగభూషణం

14:18 December 17

ప్రజల్ని రోడ్డుమీదకి తీసుకొచ్చిన నాయకుడికి గుణపాఠం చెప్పాలి: సత్యమూర్తి

  • పార్టీ జెండాలు వేరైనా అందరి అజెండా అమరావతే: సత్యమూర్తి
    అమరావతి ఉద్యమానికి భాజపా సంపూర్ణ మద్దతు: సత్యమూర్తి

14:17 December 17

రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకుండా కుట్ర చేశారు: జనసేన

  • ప్రజల మధ్య చిచ్చుపెట్టాలనే జగన్ విఫలయత్నం చేశారు: జనసేన
  • 5 కోట్ల మంది మద్దతు అమరావతికే: జనసేన
  • మూడు రాజధానులకు ప్రజామద్దతు లేదు: జనసేన
  • అప్పు చేసి తెచ్చిన రూ.లక్ష 30వేల కోట్లతో జగన్ ఏం అభివృద్ధి చేశారు: జనసేన

13:01 December 17

రాయపూడి జనభేరి సభకు చేరుకున్న చంద్రబాబు

.

13:01 December 17

చంద్రబాబు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనాలను అడ్డుకున్న పోలీసులు

  • మూడు జడ్‌ప్లస్‌ భద్రతా వాహనాలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీస్ జీపులు అడ్డుపెట్టి ఎస్కార్ట్ వాహనాలకు దారిఇవ్వని పోలీసులు
  • వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో భద్రతా సిబ్బందిలో గందరగోళం
  • ఎస్కార్ట్‌ లేకుండానే సిబ్బందితో ఉద్దండరాయునిపాలెం వెళ్లిన చంద్రబాబు

12:00 December 17

వెలగపూడి వద్ద చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

  • వెలగపూడి వద్ద కొద్దిసేపు చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో చర్చలు జరిపిన అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ
  • ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు
  • చంద్రబాబు కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలకే పోలీసుల అనుమతి
  • ఉద్యమం జరిగిన గ్రామాల మీదుగా ఉద్దండరాయునిపాలెం వెళ్తున్న చంద్రబాబు
  • ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించనున్న చంద్రబాబు
  • ఉద్దండరాయునిపాలెం నుంచి రాయపూడి సభకు వెళ్లనున్న చంద్రబాబు
     

11:47 December 17

ఉద్దండరాయినిపాలెం బయలుదేరిన చంద్రబాబు

  • దుర్గమ్మ దర్శనం అనంతరం ఉద్దండరాయినిపాలెం బయలుదేరిన చంద్రబాబు
  • శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శించనున్న చంద్రబాబు
  • రాజధాని ఉద్యమం జరిగిన గ్రామాల మీదుగా ఉద్దండరాయినిపాలెo కు చంద్రబాబు
  • పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్షాశిబిరాలు మీదుగా వెళ్తున్న చంద్రబాబు

11:34 December 17

దేవతల రాజధాని అమరావతి: చంద్రబాబు

  • విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
  • దేవతల రాజధాని అమరావతి: చంద్రబాబు
  • ఐదు కోట్లమంది తరఫున అమ్మవారిని ప్రార్థించా: చంద్రబాబు
  • అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుకున్నా: చంద్రబాబు
  • న్యాయం, ధర్మం గెలుస్తుందని విశ్వసిస్తున్నా: చంద్రబాబు

11:22 December 17

రాయపూడి సభకు వస్తున్న వాహనాల తనిఖీలు

  • తాడికొండ అడ్డరోడ్డు వద్ద రాయపూడి సభకు వస్తున్న వాహనాల తనిఖీలు
  • అమరావతి వైపు నుంచి వాహనాల్లో భారీగా తరలివస్తున్న రైతులు

10:59 December 17

అయితాబత్తుల ఆనందరావు గృహనిర్బంధం

  • తూ.గో.: అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు గృహనిర్బంధం
  • తూ.గో.: మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు గృహనిర్బంధం

10:49 December 17

రాయపూడి సభకు ముఖ్య నాయకులు కార్లలో వెళ్లవచ్చు: ఎస్పీ అమ్మిరెడ్డి

  • కార్యకర్తలతో ర్యాలీలుగా వెళ్లవద్దు: గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి
  • కరోనా కారణంగా ఒకే వాహనంలో ఎక్కువమంది వెళ్లకూడదు: ఎస్పీ అమ్మిరెడ్డి

10:48 December 17

రాయపూడిలో 'జనభేరి' బహిరంగ సభ

  • సాయంత్రం 4 గంటల వరకు జనభేరి బహిరంగ సభ
  • జ్యోతి ప్రజ్వలన చేసి సభ ప్రారంభించిన ఐకాస నాయకులు
  • అమరావతి కోసం అశువులు బాసిన వారికి నేతల నివాళులు
  • గుంటూరు: సభా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు
  • అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలు
  • అమరావతి సమరగాథ పేరిట బుర్రకథ ప్రదర్శన
  • నాజర్ కుమారుడు బాపూజీ ఆధ్వర్యంలో బుర్రకథ
  • అమరావతి ఉద్యమం, రైతుల త్యాగం స్మరించుకుంటూ బుర్రకథ
  • అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి రక్షణకై జనభేరి సభ'
  • అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బహిరంగ సభ
  • రాయపూడి బహిరంగ సభకు తరలివచ్చిన రాజధాని గ్రామాల ప్రజలు
  • గ్రామాల నుంచి ర్యాలీలుగా రాయపూడి సభాస్థలికి వచ్చిన రైతులు
  • జై అమరావతి నినాదాలతో మారుమోగిన రాజధాని గ్రామాలు
  • అమరావతి పోరాటానికి మద్దతుగా ఎస్సీ ఐకాస నేతల నిరాహారదీక్ష
  • అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సాయంత్రం వరకు సాగనున్న ఎస్సీ ఐకాస నేతల దీక్ష


 

10:48 December 17

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసుల మెహరింపు

  • ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బందోబస్తు
  • అమరావతి కరకట్ట మార్గంలో ఉన్నతాధికారులు, న్యాయమూర్తులకే అనుమతి
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, సచివాలయ అధికారులకే పోలీసుల అనుమతి

10:19 December 17

ప్రకాశ్‌నగర్‌ పీఎస్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ బైఠాయింపు

  • రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌ పీఎస్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ బైఠాయింపు
  • జనభేరి సభకు హాజరుకాకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఆందోళన

09:58 December 17

తుళ్లూరు నుంచి భహిరంగ సభకు బయలుదేరిన మహిళలు

తుళ్లూరు నుంచి భహిరంగ సభకు బయలుదేరిన మహిళలు

.

09:40 December 17

బహిరంగ సభకు తరలిన రాజధాని గ్రామాల ప్రజలు

  • రాయపూడి బహిరంగ సభకు తరలిన రాజధాని గ్రామాల ప్రజలు
  • గ్రామాల నుంచి ర్యాలీలుగా రాయపూడి సభాస్థలికి వెళ్తున్న రైతులు
  • జై అమరావతి నినాదాలతో మారుమోగుతున్న రాజధాని గ్రామాలు

09:38 December 17

సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు గృహనిర్బంధం

గుంటూరులో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గృహనిర్బంధం

గుంటూరులో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గృహనిర్బంధం

09:22 December 17

మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గృహనిర్బంధం

  • తూ.గో.: రంపచడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గృహనిర్బంధం
  • తూ.గో.: అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం
  • రాజమహేంద్రవరం రైతు కమిటీ అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు గృహనిర్బంధం
  • తూ.గో.: అచ్చంపేటలో చినరాజప్పను గృహనిర్బంధం చేసిన పోలీసులు

09:20 December 17

గుంటూరులోని తన నివాసంలో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం

.

09:17 December 17

కాసేపట్లో అమరావతి రక్షణకై జనభేరి సభ

  • అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
  • గుంటూరు: రాయపూడిలో కాసేపట్లో 'జనభేరి' బహిరంగ సభ
  • ఉదయం 10 గంటల నుంచి సా. 4 గంటల వరకు బహిరంగ సభ
  • అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి రక్షణకై జనభేరి సభ'
  • అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బహిరంగ సభ
  • జనభేరి బహిరంగ సభకు మద్దతు తెలిపిన తెదేపా, భాజపా, జనసేన
  • జనభేరి బహిరంగ సభకు మద్దతు తెలిపిన వామపక్షాలు, ఇతర సంఘాలు
  • 'జనభేరి' బహిరంగ సభకు హాజరుకానున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • 'జనభేరి' బహిరంగ సభకు హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
  • జనసేన నుంచి హాజరుకానున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్
  • 29 గ్రామాల నుంచి ర్యాలీలుగా సభా ప్రాంగణానికి రానున్న రైతులు, మహిళలు


 

08:54 December 17

జనభేరి సభకు వెళ్లకుండా పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు

జనభేరి సభకు వెళ్లకుండా పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు

అమరావతి ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా.. అమరావతిలో నిర్వహిస్తున్న జనభేరి బహిరంగ సభకు వెళ్లకుండా నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. నీటి సంఘాల నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావును గృహనిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ ని గృహ నిర్బంధం చేశారు. జనభేరి బహిరంగ సభకు వెళ్లేందుకు యత్నించిన.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావును పోలీసులు అడ్డుకున్నారు.

08:47 December 17

తెదేపా నేత వీరబాబు గృహనిర్బంధం

  • కృష్ణా: చందర్లపాడులో తెదేపా నేత వీరబాబు గృహనిర్బంధం
  • కృష్ణా: జనభేరి సభకు వెళ్లకుండా పలువురు తెదేపా నేతలకు నోటీసులు

08:45 December 17

జనభేరి సభకు హాజరుకానున్న చంద్రబాబు

  • విజయవాడ: ఉ. 11 గం.కు దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు
  • అక్కణ్నుంచి రాయపూడి జనభేరి సభకు హాజరుకానున్న చంద్రబాబు

08:40 December 17

ప్రకాశం జిల్లాలో పలువురు తెదేపా నేతల గృహ నిర్బంధం

  • ప్రకాశం: తెదేపా నేత నూకసాని బాలాజీతో పాటు పలువురు నేతల గృహనిర్బంధం

08:17 December 17

అమరావతి ఏడాది ఉద్యమానికి ప్రవాసాంధ్రుల మద్దతు

  • అమెరికాలోని వర్జీనియాలో ప్రవాసాంధ్రుల సంఘీభావం
  • ప్రవాసాంధ్రులతో కలిసి ఉద్యమానికి తెదేపా నేత బొండా ఉమ సంఘీభావం
  • మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అని నినాదాలు

08:07 December 17

నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు గృహనిర్బంధం

  • ప.గో.: నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు గృహనిర్బంధం
  • ప.గో.: జనభేరి బహిరంగ సభకు హాజరుకాకుండా అడ్డుకున్న పోలీసులు

07:41 December 17

జనభేరి సభకు వెళ్లకుండా పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు

నిర్బంధాలు

  • జనభేరి సభకు వెళ్లకుండా పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు
  • బయట ప్రాంతాల నుంచి ఎవరు రాకుండా పోలీసుల ఆంక్షలు
  • నీటి సంఘాల నేత ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు గృహనిర్బంధం
  • కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపీచంద్‌ గృహనిర్బంధం

07:07 December 17

నేడు రాయపూడిలో 'జనభేరి' బహిరంగ సభ

జనభేరి సభ 

  • అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
  • గుంటూరు: నేడు రాయపూడిలో 'జనభేరి' బహిరంగ సభ
  • అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి రక్షణకై జనభేరి సభ'
  • అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బహిరంగ సభ
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభ
  • సభకు మద్దతు తెలిపిన తెదేపా, భాజపా, జనసేన, వామపక్షాలు, ఇతర సంఘాలు
  • 'జనభేరి' బహిరంగ సభకు హాజరుకానున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • సభకు హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
  • జనసేన నుంచి హాజరుకానున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్
  • 29 గ్రామాల నుంచి ర్యాలీలుగా సభా ప్రాంగణానికి రానున్న రైతులు, మహిళలు
  • బయట ప్రాంతాల నుంచి ఎవరు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు
Last Updated : Dec 17, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details