Ambedkar Smriti Vanam: అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మక ప్రణాళికలను వైకాపా ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తోందో.. ఈ స్మృతి వనాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కొత్త రాజధానిలో గత ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రతిపాదించింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే గొప్పగా ఉండేది. స్మృతివనానికి ప్రభుత్వ మారడం వల్ల దుర్గతిపట్టింది. ప్రస్తుతం ఈ ప్రదేశమంతా చిట్టడవిని తలపిస్తోంది. రోడ్లు పాడయ్యాయి. కంపచెట్లు కమ్మేశాయి. రాజధాని రైతులు స్మృతివనం వద్దకు వెళ్లి నిరసన తెలియజేస్తున్నారనే ఉద్దేశంతో.. అక్కడి అంబేడ్కర్ నమూనా విగ్రహాలనూ ప్రభుత్వం తీసుకెళ్లింది. ప్రస్తుతం ఒక్క విగ్రహం మాత్రమే అక్కడ ఉంచారు.
అమరావతిలో చిట్టడవిని తలపిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం - బౌద్ధులు
Smriti Vanam: వైకాపా ప్రభుత్వ విధానాలతో అమరావతితోపాటు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్మృతివనం కూడా నిర్వీర్యమైపోయింది. అనేక దేశాల బౌద్ధుల సాక్షిగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం.. నేడు చిట్టడవిని తలపిస్తోంది. గత ప్రభుత్వ ప్రణాళికల్ని పక్కనపెట్టిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా చేపట్టిన ప్రాజెక్టునూ పూర్తిచేయడం లేదని.. ఎస్సీ నేతలు మండిపడుతున్నారు.
అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటు కోసం.. శాఖమూరు సమీపంలో 20ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసింది. 125 జయంతికి సంకేతంగా, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతోపాటు.. సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానమందిరం, ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసింది. 137కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్ పనులూ ప్రారంభించింది. ప్రభుత్వం మారడంతో అంబేడ్కర్ స్మృతివనం తలరాత కూడా తారుమారైంది. ఇదే తరహా ప్రాజెక్టుని విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ పనుల్లో పెద్దగా పురోగతి లేదు. ఈ ప్రాజెక్టును పక్కనపెట్టకుండా పూర్తిచేసి ఉంటే పర్యాటకంగా అభివృద్ధి జరిగేదని, అప్పట్లో స్మృతివనం నమూనా రూపకల్పనలో కీలకంగా ఉన్న.. నక్కా ఆనంద్‌బాబు ఆవేదన వెలిబుచ్చారు.
ఇవీ చదవండి: