డీజీపీని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు - డీజీపీకి మూడు పేజీల వినతిపత్రం
తాము చేసే శాంతియుత ఆందోళనలకు సహకారమివ్వాలని డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశారు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు. ఈ మేరకు డీజీపీకి వినతి పత్రం అందజేశారు.
అమరావతి పరిరక్షణ సమితి
డీజీపీ గౌతం సవాంగ్‌ను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిశారు. శాంతియుత ప్రదర్శనలకు సహకారమివ్వాలని విజ్ఞప్తి చేస్తూ.. డీజీపీకి మూడు పేజీల వినతిపత్రం అందజేశారు. 28 రోజులుగా జరుగుతున్న ఆందోళనలను వినతిపత్రంలో ప్రస్తావించారు.