రాజధాని అమరావతి కోసం ఎన్ని రోజులైనా తమ ఉద్యమం కొనసాగిస్తామని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. తుళ్లూరులో 92వ రోజు మహాధర్నా సందర్భంగా మహిళలు రహదారి పైన వడియాలు పెట్టి తమ నిరసన తెలిపారు. తుళ్లూరు శిబిరంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు హోమియా మందులను పంచిపెట్టారు. ఓ వైపు మండే ఎండలతో ఉక్క పోస్తున్న.. ఇవి ఏవీ తమ పోరాటాన్ని ఆపవని మహిళలు తేల్చి చెబుతున్నారు.
రాయపూడిలో..
మూడు రాజధానాల ప్రతిపాదనను నిరసిస్తూ రాయపూడిలో రైతులు, మహిళలు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతల జీవితాలపై రాష్ట్ర ప్రభుత్వం సవారీ చేస్తోందని, బతుకు సవారీ అనే స్కిట్‌ను ప్రదర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని.. రైతులు, రాష్ట్ర ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.