ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravthi Farmers:'90 శాతం పూర్తైన భవనాలు వినియోగంలోకి తేవాలి' - అమరావతి న్యూస్

అమరావతిలో 90 శాతం పూర్తైన భవనాలు వినియోగంలోకి తీసుకురావాలని రాజధాని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అద్దె భవనాలలో ఉంటూ కోట్ల ప్రజాధనాన్ని అద్దెల రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Amaravati Farmers protest over capital city
90 శాతం పూర్తైన భవనాలు వినియోగంలోకి తేవాలి

By

Published : Jun 15, 2021, 7:00 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 546వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, బోరుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసనలు కొనసాగించారు. రాజధానిలో 90 శాతం పూర్తైన భవనాలు వినియోగంలోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేశారు.

రాయపూడి వద్ద వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన సివిల్ సర్వీస్ అధికారుల భవనాలు పూర్తయ్యాయని వాటిని..వినియోగించకుండా వదిలేయడంతో అవి పాడవుతున్నాయన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సివిల్ సర్వీస్ అధికారుల సముదాయం వద్ద నిరసన చేపట్టారు. అందుబాటులో ఉన్న వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అద్దె భవనాలలో ఉంటూ కోట్ల ప్రజాధనాన్ని అద్దెల రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details