ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి రైతులు - అమరావతి రైతులు

రాజధాని ప్రాంత రైతులు తమ బాధను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డితో చెప్పుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కిషన్​ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలసిన అమరావతి రైతులు
కిషన్​రెడ్డితో అమరావతి రైతులు

By

Published : Nov 30, 2019, 7:52 PM IST

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలసిన అమరావతి రైతులు

భారతదేశ మ్యాప్​లో అమరావతి రాజధాని పేరును చేర్చినందుకు ఆ ప్రాంత రైతులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్​లోని భాజపా కార్యాలయంలో కిషన్​రెడ్డిని కలిసిన రాజధాని ప్రాంత రైతులు... తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని... ఎప్పుడు అభివృద్ధి చేస్తారన్న అంశం తమకు ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రికి రైతులు తెలిపారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు విశ్వాసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీనిపై తాను స్వయంగా మాట్లాడతానని కిషన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details