రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 460వ రోజుకి చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, దొండపాడు, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
పరిపాలనా రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ.. అబ్బరాజుపాలెంలో మహిళలు, రైతులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. ప్రభుత్వాలు మోసం చేసినా.. న్యాయస్థానాలు తమకు అండగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.