అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 338వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, దొండపాడు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో అమరావతే రాజధానిగా ఉంటుందని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
అలుపెరగని రైతులు...అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు నేటితో 338వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు... దీక్ష శిబిరాల్లో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు తెలిపారు. రాజధాని ఉద్యమానికి వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుందన్నారు. అన్ని జిల్లాల్లో అమరావతి ఉద్యమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మహిళ రైతులు తెలిపారు.
Amaravati agitation
అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామని చెప్పే వరకూ ఆందోళనలు విరమించబోమని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. ఉద్యమం ప్రారంభించి వచ్చేనెలతో ఏడాది పూర్తవుతోందని...ఆ తర్వాత 13 జిల్లాలోనూ ఆందోళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మహిళా రైతులు తెలిపారు.
ఇదీ చదవండి :ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్