ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 475 వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు, అనంతవరం, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తమను రోడ్డు పడేశారంటూ తెలియజేసేలా.. పండ్లు, కూరగాయలు విక్రయిస్తూ నిరసన తెలిపారు. అనంతవరంలో రైతులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దళిత ఐకాస నాయకులు వెంకటపాలెం, వెలగపూడిలోని జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాల వేసి అంజలి ఘటించారు.