ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిల్‌ - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

అమరావతి నుంచి కర్నూలుకు కార్యాలయాల తరలింపును సవాల్‌ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలు తరలించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేశారు. కార్యాలయాలు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 13 చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ ఛైర్మన్‌తోపాటు.. సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

hicourt
hicourt

By

Published : Feb 3, 2020, 12:56 PM IST

.

ABOUT THE AUTHOR

...view details