అమరావతి రైతుల ఉద్యమం 98వ రోజుకి చేరుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ రైతులు తమ శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శిబిరాల్లో మూడు మీటర్ల చొప్పున దూరంగా కూర్చుని నిరసనలు చేస్తున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి నినాదాలు చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో రాజధాని 29 గ్రామాల్లోనూ రైతుల ఆందోళన ఆపడం లేదు. లాక్ డౌన్ ఉన్నా కూడా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోరాటాన్ని మాత్రం ముందుకు తీసుకుపోతున్నారు.
98వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో 29 గ్రామాల ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా ముఖానికి మాస్కులు ధరించి, మనిషికి మనిషికి మధ్య మూడు మీటర్లు దూరం పాటించి ఆందోళన చేశారు.
98వ రోజు కొనసాగుతున్న అమరావతి ఉద్యమం
TAGGED:
latest news on amaravathi