తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడి(TRS President Election 2021) గా సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ మంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ తరఫున మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డికి నామినేషన్ సమర్పించారు.
తెరాస రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నికకు పార్టీ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న నామపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహకరణకు గడువు విధించారు. అనంతరం 25న హైటెక్స్‌లో జరిగే ప్లీనరీలో సుమారు 14వేల మంది పార్టీ ప్రతినిధులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదించగా.. మిగిలిన వారు బలపరిచారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రెండు దశాబ్దాల్లో తెరాస, ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్‌లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నారు..
కేసీఆర్ దిశానిర్దేశం!