అసెంబ్లీలో మహిళను కించపరిచేలా వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి హెచ్చరించారు. ప్రతిపక్ష నేతను, ఆయన సతీమణిని అవమానించేలా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ఈ వ్యవహారాన్ని స్పీకర్.. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చెయ్యాలన్నారు. సభలో జరిగిన అన్ని అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నాయకులే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే.. మహిళలు బయటకు వస్తారా? అని నిలదీశారు.
ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి.. లేదంటే ఉద్యమిస్తాం : ఐద్వా
మహిళలను కించపరిచేలా.. అసెంబ్లీలో వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐద్యా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
aidwa leaders condemn the ysrcp leaders comments in assembly
ప్రతిపక్ష నేత సతీమణిపై చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని స్పీకర్ కు లేఖ రాస్తామన్నారు. సభలో జరుగుతున్న ఘటనలు.. దేశం మొత్తం ఛీత్కరించుకునేలా ఉన్నాయని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవాని అన్నారు. నేతల కుటుంబ సభ్యులను సభలో విమర్శించే హక్కు ఎవరిచ్చారని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారు.
ఇదీ చదవండి:NANDAMURI FAMILY: 'మహిళలను కించపరచడం సరికాదు.. అహంభావం వీడాలి'