ఎయిడెడ్ పాఠశాలలనుంచి వస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని పురపాలక బడుల్లో సర్దుబాటు చేసేందుకు కొన్ని షరతులతో పురపాలక శాఖ సమ్మతించింది. ఎయిడెడ్‌లో ఇప్పటివరకు ఉన్న పాత సర్వీసుకు వారికి ఎలాంటి వెయిటేజీ ఉండదు. ప్రస్తుతం పురపాలక పాఠశాలల్లో నేరుగా నియామకాలకు సంబంధించిన ఖాళీల్లో మాత్రమే వీరిని విలీనం చేస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్‌అసిస్టెంట్ల కేటగిరిలలోనే నియమిస్తారు. డీఎస్సీ-2018కి సంబంధించిన బ్యాక్‌లాగ్ ఖాళీలను మినహాయిస్తారు. ఒక పురపాలక సంఘంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే విద్యాహక్కు చట్టం ప్రకారం అవసరమైతే సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించి సర్దుబాటు చేస్తారు. ప్రస్తుతం పురపాలక ఉపాధ్యాయులకున్న అన్ని సదుపాయాలు వీరికి వర్తిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక బడుల్లో అన్ని రకాల ఖాళీలు 2,053 ఉండగా.. వీటిల్లో 1,403 నేరుగా నియామక (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఖాళీలున్నాయి. 231 ఎస్‌ఏ, 885 ఎస్జీటీ, 71 భాషా పండితులు (గ్రేడ్-2), 216 ఇతర కేటగిరి పోస్టులున్నాయి.
పురపాలక బడుల్లోకి ఎయిడెడ్ టీచర్లు - ఎయిడెడ్ స్కూల్స్ తాజా వార్తలు
ఎయిడెడ్ టీచర్లను పురపాలక పాఠశాలల్లోకి తీసుకోనున్నారు. వారిని పురపాలక బడుల్లోకి సర్దుబాటు చేసేందుకు కొన్ని షరతులతో ఆ శాఖ పురపాలక సమ్మతించింది.
teachers