ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీసీసీ డెలిగేట్​గా చిరంజీవి.. కార్డు జారీ చేసిన ఏఐసీసీ - ఏపీ కాంగ్రెస్​ డెలిగేట్​గా చిరంజీవి

Chiranjeevi: ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని చిరంజీవి సోషల్‌ మీడియాలో మంగళవారం ఓ ఆడియో ఫైల్‌ను పంచుకున్నారు. దానికి ఎలాంటి క్యాప్షన్‌ రాయకపోవడంతో.. అది తాను హీరోగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలోని డైలాగ్‌ అని కొందరు.. చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడ్డారు. నెట్టింట ఇదే హాట్‌టాపిక్‌గా నిలిచింది. చిరు పొలిటికల్‌ మాటపై టీవీల్లో డిబేట్‌లు, పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై చిరంజీవి స్పందించలేదు. చిరు డైలాగ్‌ చెప్పిన మరుసటి రోజు కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కార్డు జారీ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

chiranjeevi
chiranjeevi

By

Published : Sep 21, 2022, 9:37 PM IST

AICC issued a ID card to Chiranjeevi: ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తమ ప్రతినిధులకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే సినీ నటుడు చిరంజీవికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ డెలిగేట్‌గా గుర్తింపు కార్డు జారీ అయింది. 2027 వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా పార్టీ అందులో పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న సంగతి తెలిసిందే.

‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని చిరంజీవి సోషల్‌ మీడియాలో మంగళవారం ఓ ఆడియో ఫైల్‌ను పంచుకున్నారు. దానికి ఎలాంటి క్యాప్షన్‌/కామెంట్‌ రాయకపోవడంతో.. అది తాను హీరోగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలోని డైలాగ్‌ అని కొందరు.. చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడ్డారు. నెట్టింట ఇదే హాట్‌టాపిక్‌గా నిలిచింది. చిరు పొలిటికల్‌ మాటపై టీవీల్లో డిబేట్‌లు, పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై చిరంజీవి స్పందించలేదు. చిరు డైలాగ్‌ చెప్పిన మరుసటి రోజు కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కార్డు జారీ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘ఆయన ఇంకా ఆ పార్టీలో ఉన్నారా?’ అనే ప్రశ్నలు కొందరిలో ఉత్పన్నమవుతున్నాయి. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్‌ ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details