శాసనసభ ఫర్నిచర్‌ను ఇంటికెందుకు తీసుకెళ్లారనే అంశంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమాధానం చెప్పాలని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విచారణ జరుగుతుందని తెలిశాక.. ఇప్పుడు తీసుకెళ్లామని చెబుతున్నారని దుయ్యబట్టారు. స్పీకర్గా పని చేసిన వ్యక్తే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అని అన్నారు.
'అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి' - agriculture ministery comments on kodela,over assembly furniture issue
అసెంబ్లీ ఫర్నిచర్‌ను మాజీ స్పీకర్ కోడెల ఇంటికెందుకు తీసుకెళ్లారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి కురసాల కన్నబాబు. కోడెల విషయంలో చట్టం తని పని తాను చేసుకుపోతుందన్నారు. వరదలతో గోదావరి జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.
"అసెంబ్లీ ఫర్నిచర్ ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి"
రైతులను ఆదుకుంటాం..
రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండి జలకళ సంతరించుకుందని కన్నబాబు అన్నారు. రాయలసీమలోని చాలా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్న ఆయన...రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరదలతో గోదావరి జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మినుము, పెసర విత్తనాలను వంద శాతం రాయితీతో సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.