వ్యక్తిగత దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. దీనికోసం ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాలు దాదాపు రెట్టింపు అవసరమవుతాయి. దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్ని కేంద్రాలు కావాలనే వివరాలను పంపాలని డీఈవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన కేంద్రాల్లోనే సర్దుబాటు చేయడం, సమీపంలోనే మరో పాఠశాలలో కేంద్రం ఏర్పాటు, కొంత దూరంలో ఏర్పాటుపై పరిశీలించాలని సూచించారు. ఈ వారంలో పరీక్ష కేంద్రాలను గుర్తించి డీఈవోలు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వివరాలు పంపించనున్నారు. ప్రతి బెంచిపై ఒక విద్యార్థి కూర్చునేలా చూస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు 6.39 లక్షల మంది ఉండగా వీరికి గతంలో 2,925 కేంద్రాలను కేటాయించారు. కేంద్రాలు మారితే జంబ్లింగ్‌తో పాటు హాల్‌టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌లో ఇబ్బంది
పదోతరగతి ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. వీటిని ట్రెజరీలు, పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాల సంఖ్య ఆధారంగా ప్రింటింగ్‌ప్రెస్‌లోనే ప్యాకింగ్ చేయించి నేరుగా పంపిస్తారు. వీటిని పరీక్ష రోజున తెరుస్తారు. పరీక్ష కేంద్రాలు మారిస్తే ప్యాకింగ్‌లను విప్పి సర్దుబాటు చేయాలి. ఇది అధికారులకు కత్తిమీద సాములా మారనుంది.
వసతిగృహాల విద్యార్థులకు మరో సమస్య