తెలంగాణ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.