వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమంలో.. వృద్ధులు చాలా మంది ఉన్నారు. వారికి.. నిర్వాహకురాలు యాకూబీ క్షవరం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులు అందుబాటులో లేక కొన్ని రోజులుగా వారికి జుట్టు, గడ్డం పెరిగాయి. ఎండాకాలం కావటం వల్ల చిరాకు పడుతున్నారు. వారి అవస్థ చూసిన యాకూబీ సోమవారం స్వయంగా 20 మందికి క్షవరం చేశారు. సమస్య తీర్చారు.
వృద్ధుల కోసం.. పెద్ద మనసుతో.. - warangal urban
లాక్‌డౌన్‌తో తెలంగాణ రాష్ట్రంలో క్షౌర శాలలు మూతపడ్డాయి. ఫలితంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట ప్రశాంతినగర్ అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు.. ఓ మహిళ క్షవరం చేసింది.
వృద్ధులకు క్షవరం చేస్తున్న మహిళ