ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ల్యాప్‌టాప్‌ పేలుడు ఘటనలో గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి - software employee injured

కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో వర్క్ ఫ్రం హోమ్​లో భాగంగా విధులు నిర్వహిస్తూ ల్యాప్​టాప్​ పేలడంతో గాయపడిన ఉద్యోగిని చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమతి.. ఇంటి దగ్గరే విధులు నిర్వహిస్తోంది. లాప్​టాప్​​కు ఛార్జింగ్​ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా పేలింది.

laptop blast
laptop blast

By

Published : Apr 23, 2022, 12:50 PM IST

ల్యాప్‌టాప్‌ పేలి తీవ్రంగా గాయపడిన వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22) శుక్రవారం తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమలత బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న తన ఇంటిలో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా ఆమె ఛార్జింగ్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలింది. పరుపు, మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమలత ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి

ABOUT THE AUTHOR

...view details