ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder: హైదరాబాద్-విజయవాడ హైవే పై మర్డర్.. అసలేం జరిగింది? - తెలంగాణ వార్తలు

కారులోనే వ్యక్తిని దారుణంగా హత్యచేశారు(Murder in Hayathnagar). కారం పొడిచల్లి మరీ హతమార్చారు(Murder in Hayathnagar). హైదరాబాద్​లోని హయత్​నగర్​ హైవే బావర్చీ దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హత్య
హత్య

By

Published : Oct 23, 2021, 1:07 PM IST

హైదరాబాద్ హయత్​నగర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు కిరాతంగా హత్య(Murder in Hayathnagar) చేశారు. బావర్చీ సమీపంలో రోడ్డుపై కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు. ఆ కారును చూసినవారు పార్కింగ్ చేసి ఉందని భావించారు. కానీ.. ఆ కారు దగ్గరి నుంచి వెళ్లిన వాళ్లకు అనుమానం వచ్చింది.

వెనుక సీట్లో ఏదో ఉండటాన్ని గమనించారు. పరిశీలించి చూస్తే.. అందులో ఓ శవం కనిపించింది. వ్యక్తిపై కారం చల్లి ఉండడం.. రక్తపు మరకలు ఉండడంతో హత్య(Murder in Hayathnagar)గా అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్​ తో పోలీసులు రంగంలోకి దిగారు. కారు నంబర్ సగం విరిగి ఉండడంతో వివరాలు తెలియలేదు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం

ABOUT THE AUTHOR

...view details