ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

9PM TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

.

ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM
9PM TOP NEWS

By

Published : Oct 4, 2022, 9:04 PM IST

  • భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి
    CHIRU COMMENTS ON POLITICS : గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్‌ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తన మద్దతు తప్పనిసరిగా పవన్​కు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేసే విధంగా చేయలేదని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సూర్యలంక సముద్రతీరంలో విషాదం.. గల్లంతైన ఏడుగురిలో ముగ్గురు మృతి
    STUDENTS MISSING : బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రస్నానం చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకుల్లో ముగ్గురు.. చనిపోయారు. విజయవాడకు చెందిన 8మంది విద్యార్థులు సూర్యలంక తీరానికి వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి..ఏడుగురు కొట్టుకుపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చివరి అంకానికి దసరా ఉత్సవాలు.. పూర్ణాహుతి, తెప్పోత్సవంతో పరిసమాప్తం
    DUSSEHRA AT VIJAYAWADA : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. రేపు మధ్యాహ్నం పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మహర్నవమిని పురస్కరించుకుని దుర్గమ్మ మహిషాసురమర్థినిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉత్సాహభరితంగా అమరావతి రైతుల పాదయాత్ర.. పూల వర్షాలు, హారతులతో స్వాగతం
    FARMERS MAHAPADAYATRA : అమరావతి రైతుల మహాపాదయాత్ర.. దిగ్విజయంగా కొనసాగుతోంది. 23వ రోజు ప్రజలు.. రైతుల యాత్రకు మద్దతు తెలుపుతూ స్వాగతం పలికారు. అమరావతి ఆకాంక్షతో ముందుకు సాగిన రైతులు.. మంత్రుల వ్యాఖ్యలు, వ్యతిరేక ఫ్లెక్సీలను తప్పుపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా.. 105 ప్రదేశాల్లో సోదాలు.. ఇంటర్​పోల్ సమాచారంతో...
    సైబర్ నేరగాళ్లను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 105 ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • విషమంగానే ములాయం ఆరోగ్యం.. ఆస్పత్రికి కుటుంబ సభ్యులు.. అఖిలేశ్​కు యోగి ఫోన్
    Mulayam Singh Yadav Health : సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం కుటుంబ సభ్యులు గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముగ్గురు శాస్త్రవేత్తలకు 'భౌతిక' నోబెల్.. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు పురస్కారం
    భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దసరా రోజే జియో 5జీ ట్రయల్​.. ముందుగా ఈ నాలుగు నగరాల్లోనే..
    JIO 5G Services : జియో.. బుధవారం నుంచి నాలుగు నగరాల్లో 5జీ సర్వీసుల ట్రయల్​ను నిర్వహించనుంది. నాలుగు నగరాల్లో ఈ బీటా ట్రయల్ నిర్వహించనున్నట్లు జియో ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • మహిళల ఆల్​రౌండ్ షో.. ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ విన్.. టేబుల్​లో అగ్రస్థానం
    womens asia cup 2022 : ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మూడో టీ20లో 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • అందులో వాళ్లు.. ఇందులో వీళ్లు.. 'గాడ్‌ఫాదర్‌'లో ఆ పాత్రలు చేశారంటే?
    Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. మలయాళంలో విజయం సాధించిన 'లూసిఫర్‌' రీమేక్‌గా ఇది వస్తోంది. మరి మలయాళంలో చేసిన పాత్రలను తెలుగులో ఎవరెవరు చేస్తున్నారో చూసేద్దామా! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details