- వందేళ్లలో గోదావరికి ఇంతముందుగా ఇలా వరద ఎప్పుడూ రాలేదు: సీఎం జగన్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై కలెకర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- అడగకముందే మద్దతిచ్చారు.. వైకాపాకు ముర్ము కృతజ్ఞతలు
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము వైకాపా ప్రజా ప్రతినిధులను కోరారు. తాను అడగకముందే జగన్ మద్దతిచ్చారంటూ.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు
- CHANDRABABU: 'ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపిద్దాం'
రాష్ట్రంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. తాజ్ గేట్ వే హోటల్ వద్ద ద్రౌపది ముర్ముకు తెదేపా అధినేత చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్ముకు చంద్రబాబు పరిచయం చేశారు.
- కోర్టుకు హాజరుకాని ఆర్థికశాఖ కార్యదర్శి.. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ
ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. నేడు కోర్టు హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది.
- 'షార్ట్‌కట్ రాజకీయాల్ని నమ్ముకుంటే షార్ట్ సర్క్యూటే!'
షార్ట్‌కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వాటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ ఖాయమని హెచ్చరించారు. ఝార్ఖండ్ దేవ్గఢ్లో పర్యటించిన మోదీ.. రూ.16,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
- 'జాతీయ చిహ్నాన్నీ మార్చేస్తారా? ఇదేం పద్ధతి మోదీజీ..??'
పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది. కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యపూర్వకంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలన్నది వారి ప్రధాన డిమాండ్.
- ఇరాన్‌కు పుతిన్.. ఆ అధునాతన డ్రోన్ల కోసమే.. ఉక్రెయిన్‌కు ఇక కష్టమే!
ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం ఇరాన్ వెళ్లనున్నారు. ఇరాన్ నుంచి రష్యా మానవరహిత డ్రోన్ల సాయం కోరిందని అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
- గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే లాభాలెన్నో!
ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీ జులై 31. ఆఖరి నిమిషం వరకు వేచిచూడకుండా ఆ పని ముందే పూర్తి చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.
- 'అక్డీ పక్డీ' సాంగ్ కొరియోగ్రఫీ సమయంలో ఏడ్చేశాను: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమాలోని 'అక్డీ పక్డీ' పాట దుమ్ము లేపుతోంది. విజయ్, అనన్య స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే సాంగ్ కొరియోగ్రఫీ సమయంలో తాను ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చాడు విజయ్.
- నిప్పులు చెరిగిన బుమ్రా.. 110కే చేతులెత్తేసిన ఇంగ్లాండ్
బుమ్రా (6/19) దెబ్బకు తొలి వన్డేలో ఇంగ్లాండ్ కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఎదుట 111 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. ఇందులో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.