- పారిశ్రామికవేత్తలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జగన్
పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లాలో పలు పరిశ్రమలకు జగన్ శంకుస్థాపన చేశారు.
- డబ్బుల్లేవ్.. "దుల్హన్" పథకం నిలిపేస్తున్నాం: జగన్ సర్కారు
ముస్లింల అభ్యున్నతికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. రెండు పథకాలు అమలు చేయలేమని వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్, విదేశీ విద్యా పథకాలను.. నిధుల కొరత కారణంగా అమలు చేయడం లేదని హైకోర్టుకు తెలిపింది.
- ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నిక..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 64.17 శాతం ఓటింగ్ నమోదైంది. 6 గంటలవరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
- ఆ ప్రచారంపై వెంకయ్య కూడా ఆవేదన చెందారు: సత్య కుమార్
రాష్టపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయలేదనే విషయంపై రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా చేపట్టిన పదవులన్నీ పార్టీ ఇచ్చిన అవకాశాలేనని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు.
- మోదీతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము భేటీ
అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు.
- శిందే తిరుగుబాటు సక్సెస్!.. బలంగా రెబల్ క్యాంప్..
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు శిందే క్యాంపునకు చేరుకున్న నేపథ్యంలో.. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన చెబుతుండగా..
- జర్మనీలో గ్యాస్ సంక్షోభం.. ఆయనే కారణమట!
ఈయూ ఆంక్షలకు ప్రతిగా గ్యాస్ సరఫరాలో రష్యా విధిస్తున్న కోతలు ఐరోపా దేశాల్లో సంక్షోభానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీని గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా అక్కడ గ్యాస్ వినియోగంపై జర్మనీ ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,500గా ఉంది. కిలో వెండి ధర రూ.62,050గా ఉంది.
- రోహిత్ శర్మ @15 ఇయర్స్.
అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా అభిమానులకు లేఖను విడుదల చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జర్నీని తన జీవితమంతా గుర్తుంచుకుంటానన్నారు.
- చర్చలు సఫలం.. దిల్‌రాజు అధ్యక్షతన కమిటీ
ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో షూటింగ్స్‌కు యథావిధిగా హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.
9PM TOP NEWS