ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

...

9pm top news
9pm top news

By

Published : Jun 15, 2022, 8:59 PM IST

  • రివర్స్ పాలనకు రివర్స్‌ ట్రీట్‌మెంట్‌.. ఆ రోజు దగ్గర్లోనే ఉంది: చంద్రబాబు

వైకాపా రివర్స్‌ పాలనకు రివర్స్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసి సీఎం జగన్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. వైకాపాపై తిరుగుబాటు మెుదలైందని..,'క్విట్‌ జగన్‌-సేవ్‌ ఆంధ్రప్రదేశ్' నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు సూచించారు.

  • CM JAGAN REVIEW MEETING : త్వరలో రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున ఉపాధి లభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూములు లీజుకిచ్చిన రైతులకు ఎకరానికి ఏడాదికి 30 వేల రూపాయలు ఇచ్చే విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు.

  • పంట బీమాపై రైతుల నిరసన.. గ్రామాల సచివాలయాలకు తాళాలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసనల బాట పట్టారు. పలు మండలాల్లో గ్రామాల సచివాలయాలకు తాళాలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమాలో అర్హులైన వారికి అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • SRISAILAM RESERVOIR : ఎగువ నుంచి.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 23,464 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 821.10 అడుగులుగా ఉంది.

  • 'ఉమ్మడి అభ్యర్థి'పై విపక్షాల ఏకాభిప్రాయం.. పవార్​ను ఒప్పించటంలో విఫలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని తీర్మానించాయి 17 పార్టీలు. అయితే, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ ఒప్పించటంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.

  • రాష్ట్రపతి ఎన్నికపై ఖర్గే- రాజ్​నాథ్ కీలక చర్చలు.. ఏకగ్రీవం దిశగా...!

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్​నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?... కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.

  • స్వప్న ఆరోపణలతో చిక్కుల్లో అధికార పక్షం.. ఆ వీడియోతో సీఎంఓ కౌంటర్​

రెండేళ్ల క్రితం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్న 30 కిలోల బంగారం వ్యవహారం ఇప్పుడు కేరళ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలు ఏకంగా సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులకు ఇందులో భాగముందంటూ సంచలన ప్రకటన చేసింది.

  • 5G స్పెక్ట్రం వేలానికి కేబినెట్​ ఓకే​.. అందుబాటులోకి వస్తే 10 రెట్ల వేగంతో..

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా కేంద్రం మరో ముందడుగు వేసింది. 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • భారీ విజువల్​ వండర్​గా రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్​

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది.

  • ఇషాన్​ సూపర్​.. 68 స్థానాలు ఎగబాకి టాప్​10లోకి.. రోహిత్​, కోహ్లీల ర్యాంకులు​ ఎంతంటే?

అంతర్జాతీయ క్రికెట్​​ కౌన్సిల్​ క్రికెటర్ల టీ20, టెస్టు, వన్డేల ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. టీమ్​ఇండియా తరఫున టీ20 ర్యాంకింగ్స్​లో ఇషాన్​ కిషన్​ ఒక్కడే నిలవగా.. టెస్టుల్లో ఐదుగురికి, వన్డేల్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. మరి ఈ లిస్ట్​లో ఏ క్రికెటర్​ ర్యాంకు ఎంత ఉందంటే..

ABOUT THE AUTHOR

...view details