ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - తెలుగు తాజా వార్తలు ఏపీ ప్రధాన వార్తలు

.

9pm top news
ప్రధాన వార్తలు@ 9pm

By

Published : Jul 15, 2020, 9:00 PM IST

  • రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ
    సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మహమ్మారి విజృంభణ
    రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కొత్తగా 2,432 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 44 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'కొత్త కౌలుదారు చట్టం'
    భూ యజమానులు, కౌలు రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. రైతు భరోసా, వడ్డీలేని రుణం, రూపాయికే బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దర్శనాలపై తీవ్ర ప్రభావం
    శ్రీవారి దర్శనాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. దర్శనాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నప్పటికీ.. ఆ మేరకు భక్తులు రావడం లేదు. ఫలితంగా ప్రత్యేక ప్రవేశ, సర్వదర్శనాలు, విరామ సమయ దర్శానాల టికెట్లు భారీగా మిగిలిపోతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రూ.650కే కరోనా టెస్టింగ్ కిట్!
    దేశంలో కొవిడ్​ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు చేసేలా కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది దిల్లీ ఐఐటీ విద్యార్థుల బృందం. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా రూ.650కే ఈ కిట్​ను విక్రయించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అపార అవకాశాలు'
    భారత్​, ఐరోపా సమాఖ్య మధ్య జరుగుతున్న 15వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం భారత్, ఐరోపా సమాఖ్య మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రిలయన్స్ ఏజీఎం హైలైట్స్
    రిలయన్స్ ఇండస్ట్రీస్.. వరుస పెట్టుబడులు, కీలక భాగస్వామ్యాలతో దేశంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఈ నేపథ్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సంస్థ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మరిన్ని కీలక అభివృద్ధి ప్రణాళికలు ఆవిష్కరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాక్​ క్రికెటర్​ చిట్కాలు
    పాకిస్థాన్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​ ఎనిమిదేళ్ల అభిమానితో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంభాషించాడు. ఇటీవలే సామియా అనే బాలిక క్రికెట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆటతీరును మెచ్చుకున్నాడు బాబర్​. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విచారణకు సల్మాన్​ ఖాన్?​
    సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ చనిపోయి నెలరోజులైనా అతని మరణం వెనక ఉన్న మిస్టరీ ఇంకా తెలియలేదు. తాజాగా హీరో సల్మాన్​ ఖాన్​ను పోలీసులు ఈ కేసులో విచారించే వీలుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details