- ప్రలోభపెట్టి నాయకులను లొంగదీసుకుంటారా..?: చంద్రబాబు
ప్రతిపక్ష నాయకులను భయపెట్టి లొంగదీసుకుంటారా అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని ప్రలోభపెడితే ఆయన లొంగనందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో శాంతిభద్రతల అంశం పెట్టకపోవటం పిరికితనమని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 9నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్యకేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షే ఉరిశిక్ష లాంటిదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆ శాఖలో అర్హత వయసు 42 ఏళ్లే..!
వైద్యారోగ్యశాఖలో నియామకాలకు అర్హత వయసు 42 ఏళ్లకే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఉద్ధవ్ ఠాక్రే సర్కారుకు ఏ ఢోకా లేదు'
అసలే కరోనా ఉద్ధృతి.. కూటమి ప్రభుత్వంలో తమకు తగిన గౌరవం ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్రలో ఐదేళ్లు పరిపాలన సాగిస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్
భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలో సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందారు. సైన్యంలో కల్నల్ ర్యాంక్ అధికారిగా ఉన్న సంతోష్ ప్రాణాలు విడిచారు. నిన్న రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఆయన మరణ వార్తను ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు చేరవేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చైనా వల్లే సరిహద్దులో ఉద్రిక్తత: భారత్
"ఈ నెల 15 సాయంత్రం-రాత్రి సమయంలో... ఏకపక్ష ధోరణితో సరిహద్దులో పరిస్థితులను మార్చడానికి చైనా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్-చైనా బలగాల మధ్య హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఇరు వైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'బడ్జెట్ సమావేశాలు సినిమా ట్రైలర్‌లా ఉంది'
రాష్ట్ర గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి... ఇంటి నుంచే మాట్లాడటం చట్టసభలను అవమానపరిచేనట్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం చేస్తామంటున్న ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలకు నిధులు కేటాయించటంలో విఫలమైందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భారత క్రికెటర్లపై పాక్ దిగ్గజం ప్రశంసలు
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ స్పిన్ దిగ్గజం సక్లెయిన్ ముస్తాక్. స్వదేశీ పిచ్‌పై అతడు చెలరేగిపోతాడని కితాబిచ్చాడు. భారత క్రికెటర్లు కోహ్లీ, జడేజా, కుల్దీప్ యూదవ్నూ ప్రశంసించాడు ఈ పాకిస్థాన్ మాజీ ఆటగాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'సుశాంత్ కెరీర్ పాడవడానికి వాళ్లే కారణం'
తన కెరీర్ నాశనం అవడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి కుటుంబం అని ఆరోపించారు ప్రముఖ దర్శకుడు అభినవ్ కశ్యప్. సుశాంత్ మృతికి యష్రాష్ ఫిలింస్ యాజమాన్యం కారణమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కరోనా మరణాన్ని తప్పించే ఔషధం ఇదే!
ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ నుంచి ప్రజలను డెక్సమెథసోన్ అనే ఓ ఔషధం కాపాడుతోంది. దీన్ని వాడటం వల్ల మృత్యువు అంచుకు వెళ్లిన బాధితులను కూడా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి బ్రిటన్‌లో మొత్తం 5 వేల మందిని రక్షించారు. అతితక్కువ ధరకే ఈ మందు అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి