ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 pm - trending news

.

9pm top news
ప్రధాన వార్తలు @9pm

By

Published : Jun 10, 2020, 9:00 PM IST

  • ఎలా తొలగిస్తారు?

నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులిచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • అసలేం జరిగింది..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని హితవు పలికింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • న్యాయవాదుల రాజీనామా!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు ముగ్గురు.. ఒకేసారి రాజీనామా చేశారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్.. విధుల నుంచి ఒకేసారి తప్పుకొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వైకాపా గూటికి శిద్దా

తెదేపాకు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైకాపా గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. .పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'చేదోడు కాదది.. జగన్మాయ పథకం'

రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్​ మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. చేదోడు పథకం మరో మాయా పథకమన్న ఆయన.. గతంలో అందరికీ వర్తింప చేస్తామని చెప్పి.. ఇప్పుడు పరిమితి విధిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రెమ్డెసివిర్​పై ఆశలు

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ను కనుగొనటంలో పలు దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివిర్‌' అనే ఔషధం.. కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • సీఎంను అందుకే కలవలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో సినీపెద్దలు నిర్వహించిన సమావేశానికి తనను పిలవకపోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తనకు మర్యాద ఇవ్వకపోవడం వల్లే తాను అలా మాట్లాడినట్లు చెప్పారు బాలకృష్ణ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇక ఆగలేము

సెట్​లో అడుగుపెట్టడానికి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు దర్శకధీరుడు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇన్​స్టా స్టోరీస్​లో ఓ పోస్ట్​ చేశారు జక్కన్న. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • అభిమానులకు షాక్​

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, దాదాపు అన్ని ప్రఖ్యాత ట్రోఫీలను ముద్దాడిన భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ అభిమానులు ట్విట్టర్​ ట్రెండింగ్ వార్తలను​ చూసి షాకయ్యారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • 'చెక్​బౌన్స్​'కు మినహాయింపు!

కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం పలు కీలక ప్రతిపాదనలు చేసింది. సులభతర వాణిజ్యానికి ఊతమిచ్చేలా 19 చట్టాల్లోని చెక్​బౌన్స్​ వంటి చిన్నపాటి తప్పిదాలను క్రిమినల్​ చర్యల నుంచి మినహాయించాలని భావిస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details